మహానాడుకు సిద్ధమవుతున్న టీడీపీ.. రూ.18 లక్షలతో భారీ కటౌట్

  • మహానాడు సందర్భంగా విజయవాడలో 150 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు
  • చంద్రబాబు నిప్పులాంటి మనిషి అన్న బుద్దా వెంకన్న
  • వైఎస్ హయాంలో చంద్రబాబుపై 11 ఎంక్వయిరీలు విఫలమయ్యాయన్న బుద్దా
టీడీపీ మహానాడు నేపథ్యంలో, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వన్‌టౌన్ సీతమ్మవారి పాదాల వద్ద టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న సుమారు రూ.18 లక్షల వ్యయంతో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. 150 అడుగుల ఎత్తు ఉన్న ఈ కటౌట్‌పై ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ చిత్రాలను పొందుపరిచారు. ఈ కటౌట్ ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ, ఎన్టీఆర్ జన్మస్థలం, రాజధాని అమరావతి ప్రాంత ప్రజలకు కనిపించేలా దీనిని ఏర్పాటు చేశామని తెలిపారు.

గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చంద్రబాబుపై 11 ఎంక్వయిరీలు చేయించినా ఏమీ నిరూపించలేకపోయారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని బుద్దా వెంకన్న కొనియాడారు. చంద్రబాబు నాయుడు నిప్పులాంటి మనిషని, ఆయనను పట్టుకోవాలని చూస్తే మాడి మసైపోతారని వ్యాఖ్యానించారు.

Budda Venkanna
TDP Mahanadu
TDP
NTR
Chandrababu Naidu
Nara Lokesh
Vijayawada
Andhra Pradesh Politics
Amaravati

More Telugu News